Ade Gajender :ప్రొటోకాల్ లేని వ్యక్తి అధికారిక కార్యక్రమాలలో ఎలా పాల్గొంటారు.!

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
ప్రొటోకాల్ లేని వ్యక్తి అధికారిక కార్యక్రమాలలో ఎలా పాల్గొంటారు.!
*మండల కన్వీనర్ తోట వెంకటేష్

ప్రొటోకాల్ లేని వ్యక్తి అధికారిక కార్యక్రమాలలో ఎలా పాల్గొంటారని మండల కన్వీనర్ తోట వెంకటేష్ అన్నారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో గల బీఆర్ ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగ‌ళ‌వారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ తోట వెంకటేష్ మాట్లాడారు.  ప్రోటోకాల్ లేని వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తి అధికారిక కార్యక్రమాలలో ఎలా పాల్గొంటారని ప్ర‌శ్నించారు. అడే గజెందర్ అనే వ్యక్తి ఆయనకు ఏ విధమైన ప్రోటోకాల్ ఉంది ఆయన అధికారిక సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజలలో ఏవిధంగా పాల్గొంటారు అని, ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని అన్నారు.  అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు కి ఎన్ఆర్ ఈజీఎస్ క్రింద 6 కోట్లు మంజూరు చేసి కాంగ్రెస్ పార్టీ కీ చెందిన వ్యక్తి అని ఆయనకు 7 కోట్లు ఏ విధంగా మంజూరు చేస్తారని ప్రశ్నించారు.  ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యానికి అప్రదిష్ట అని అన్నాడు ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు.  స‌మావేశంలో ఝరి సొసైటీ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి,  మండల నాయకుడు పిడుగు అభిరాం రెడ్డి ఉండం మాజీ సర్పంచ్ నర్సింహులు, ఎంపీటీసీ చంటి మగ్గిడి ప్రకాష్,నిట్యడి గంగాధర్, మహేష్ సుదర్శన్ రెడ్డి, సురేందర్ రెడ్డి,  రాంబాయి, పల్లవి, ఆశన్న యాదవ్,  రాంకిషన్, మల్లేష్ ,గంగయ్య, ఆనంద్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *