సిరాన్యూస్, గుడిహత్నూర్
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
* పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ బోథ్ ఇన్‌చార్జి ఆడే గజేందర్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని డోoగర్గావ్ గ్రామంలో గురువారం పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ బోథ్ ఇన్‌చార్జి ఆడే గజేందర్, గ్రామ అధ్యక్షులు షేక్ షకీల్ సమక్షంలో మాజీ ఎంపీటీసీ రౌఫ్ ఖాన్, ఓర్సు మారుతీ, షేక్ సలీం, దోమకొండ పిరా జి, జొన్దలే భీంరావ్, సొంకాంబ్లె రంజిత్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని తెలిపారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం సాయ శక్తిలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమం లో సీనియర్ నాయకులు సొంటక్కే బాలాజీ, నాగ్నత్ అప్ప ఆడే షీలా కరాడ్ బ్రహ్మానండ్, అంకతి రవి,మల్యాల కరుణాకర్,మెస్రం జాలెందర్, గజభారే కచురు తదితరులు పాల్గొన్నారు.