సిరాన్యూస్,ఇచ్చోడ
అడేగామ(కె)లో పోస్టుమాస్టర్ బూస పోశాలుకు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడేగామ (కే) గ్రామం నుంచి బోరిగామ గ్రామానికి బదిలీపై వెళ్లిన పోస్టల్ అధికారి బూస పోశాలును గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. బుధవారం మండలంలోని పాఠశాలలో పోస్టల్ అధికారి బూస పోశాలు గ్రామస్తులు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా పోస్టల్ అధికారి బూస పోశాలు మాట్లాడుతూ గ్రామాన్ని విడిచి వెళ్తుండడం బాధగా ఉన్నప్పటికీ, ఉద్యోగులకు విధుల నిర్వహణలో బదిలీలు సహజమని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.