సిరాన్యూస్,ఆదిలాబాద్
ఆదిలాబాద్ కు చేరుకున్న రాజీవ్ జ్యోతి యాత్ర
* బృందానికి ఘన స్వాగతం పలికిన కంది శ్రీనివాసరెడ్డి
ఐటీరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన రాజీవ్‌గాంధీని స్మరించుకోవడం మనందరి బాధ్యతని, వారి సేవలు, త్యాగాలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. నార్త్ చెన్నయ్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, చెన్నయ్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్యామూల్ దిరవైయం సారథ్యంలో చేపట్టిన రాజీవ్‌గాంధీ జ్యోతి యాత్ర మంగళవారం ఆదిలాబాద్‌కు చేరుకుంది. ఈసందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు.యాత్రకు సంబంధించిన వివరాలను బృందం సభ్యులు శ్రీనివాసరెడ్డికి వివరించి ఆయనకు జ్యోతిని అందించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి యాత్రను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం రాజీవ్‌గాంధీ కుటుంబమని, వారి త్యాగాల పునాదుల మీదనే దేశాన్ని నిర్మించారు తప్పా వారు ఏనాడు తమ స్వార్థం చూసుకోలేదని అన్నారు. ఈ యాత్ర కన్యాకుమారి నుండి ప్రారంభమై శ్రీపెరంబుదూర్ వరకు అక్కడి నుండి ఆగస్టు 20న న్యూ ఢిల్లీ కి చేరుకుంటుందని వెల్లడించారు. యాత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, బేల మండల అధ్యక్షులు ఫైజల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు సంజయ్ గుండావార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.