సిరాన్యూస్,ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
విశ్వ సృష్టికర్త, ప్రపంచంలోనే మొట్ట మొదటి శిల్పి భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలలో విశ్వకర్మ మరాఠీ ( వడ్రంగి) సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఘనంగా జరుపుకున్నారు.శాంతినగర్లో సంఘం జిల్లా అధ్యక్షులు జాన్వె సంతోష్ ఇంటి వద్ద నిర్వహించిన వేడుకలు బీసీ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలల శ్రీనివాస్, కులస్తులు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. విశ్వకర్మలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని బీసీ సంఘం నేతలు ఆకాంక్షించారు. కార్యక్రమాల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాన్వే సంతోష్, దిలీప్, నేతలు అబయ్, వెంకటి, దేవిదాస్, నాగోరావ్, ప్రమోద్, కాశినాథ్ పాల్గొన్నారు.