సిరా న్యూస్, అదిలాబాద్:
మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఆదిలాబాద్ ఎయిర్ స్ట్రిప్ పై నీలినీడలు..
ఆదిలాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాంచాల్సిన ఎయిర్ స్ట్రిప్ పై నీలి నీడలు కమ్ముకున్నట్లు కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013-14 లో అప్పటి కలెక్టర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 369 ఎకరాలు భూసేకరణ కూడా చేపట్టి, మరో 1500 ఎకరాల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందని అన్నారు. ఇలా బాద్ లో ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు అయితే ఆదిలాబాద్ ప్రత్యేక స్థానం లభిస్తుందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఉత్తర తెలంగాణపై శ్రద్ధ లేకపోవడంతోనే ఆదిలాబాద్ కు 5000 కోట్ల ఈ ప్రాజెక్టు దక్కలేదని విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ ను దత్తత తీసుకొని ఎయిర్ పోర్ట్ నిర్మాణ దిశగా అడుగులు వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో నాయకులు రాందాస్ నాక్లే, బొల్లారం బాబన్న, కాంబ్లీ మనోజ్, రూపేష్ రెడ్ది, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.