సిరా న్యూస్, ఆదిలాబాద్:
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి…
-డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ నాయకులు అడ్డి బోజారెడ్డి
ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలంతా కలిసికట్టుగా పని చేయాలని డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రజాసేవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ కు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ఐటీడీఏ డైరెక్టర్లు, ఇతర నాయకులు భారీగా కాంగ్రెస్ లోకి చేరెందుకు రావడం సంతోషకరమని అన్నారు. నిర్మల్ లో సభలో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో వారంతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆదిలాబాద్ నుంచి నిర్మల్ కు ప్రత్యేక బస్సులో వారంతా బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డి, తుమ్మల వెంకటరెడ్డి, గిమ్మ సంతోష్‌రావు, గణపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.