సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ కు మరో షాక్
కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు కౌన్సిలర్
* మంత్రి పొంగులేటి సమక్షంలో పార్టీలో చేరిన అర్చనారామ్‌కుమార్, సుజాత భూమన్న
ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వరుస కట్టి కాంగ్రెస్ గూటికి రావడంతో బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో మరింత బలహీనపడిపోతుంది. క్యాడర్ లేక కారుపార్టీ చతికిలపడిపోతోంది. తాజాగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు కైలాస్‌నగర్ కౌన్సిలర్ అర్చన- రామ్‌కుమార్, 10వ వార్డు కౌన్సిలర్ రాంనగర్ కు చెందిన సుజాత-భూమన్న హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల్లో 77వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించిందని, ఆదిలాబాద్ భవిష్యత్తు కంది శ్రీనన్న మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తుమల్లేష్, సీనియర్ నాయకులు వేణుగోపాల చారి ,లోక ప్రవీణ్‌రెడ్డి, డేరా కృష్ణారెడ్డి, నరేష్, అఖిల్ పాల్గొన్నారు.