సిరాన్యూస్, ఆదిలాబాద్
సీఎంతో కంది శ్రీనివాసరెడ్డి దంపతులు
* నిశ్చితార్ధ వేడుకకు హాజరు
హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి మౌనారెడ్డిలు కలిశారు. ముఖ్యమంత్రి సోదరుడు అనుముల జగదీష్ రెడ్డి కుమార్తె రుత్విక వివాహ నిశ్చితార్ధ వేడుకకు కంది శ్రీనివాస రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఇరు కుటుంబాలకు ఆత్మీయులు కాగా, కార్యక్రమానికి హాజరై రుత్విక- అభిజిత్ లను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా సీఎం ఆత్మీయంగా మాట్లాడారు.