సిరా న్యూస్, ఆదిలాబాద్:
అమెరికా పోను… ఆదిలాబాద్‌లోనే ఉంటా…
+ కాంగ్రేస్‌లో చేరికల కార్యక్రమంలో కంది
+ బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం అయిన వ్యాఖ్యలు
+ ఇక కాంగ్రేస్ వర్సెస్ బీజేపీ అని స్పష్టీకరణ
+ పార్లమెంట్ ఎన్నికల్ళో ఢంకా మోగిస్తామని ధీమా
తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా వెళ్లిపోతానని ప్రతిపక్షాలు తనపై దుష్ప్రచారం చేసారని, తానెక్కడి వెళ్లనని ఆదిలాబాద్ ప్రజలతోనే ఉంటానని కాంగ్రేస్ పార్టి నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌నగర్ కాలనీలో నాయకులు ఖిజర్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రేస్‌లో చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కాంగ్రేస్‌లోకి చేరేందుకు రాగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గతంలో పోటీ చేసిన కాంగ్రేస్ నాయకుల కంటే కూడ తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయనీ, తనపై నమ్మకంతో ఓట్లేసిన వారందరికి రుణపడి ఉంటానని తెలిపారు. కాగా వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ విజయం ఖాయమని అన్నారు. బీఆర్‌ఎస్ పని పూర్తిగా అయిపోయిందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీజేపీకి మద్యనే పోటీ ఉంటుందని తెలిపారు. తాను ప్రజల మనిషినని, ఆదిలాబాద్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు శక్తివంచన లేకుండా పనిచేయాలని, రానున్న అన్ని ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషీ చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, ముడుపు దామోదర్ రెడ్డి, ఎం ఏ షకీల్, అల్లూరి అశోక్ రెడ్డి, రూపేష్ రెడ్డి, ఉయికా ఇందిరా, బూర్ల శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.