సిరా న్యూస్,నిర్మల్;
సారంగాపూర్ మండల కేంద్రంలో నీ ఎంపీపీ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో సరోజ అధ్యక్షతన జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశం వాయిదా పడింది. సమావేశానికి 15 మంది ఎంపీటీసీ సభ్యుల్లోఒక ఒక ఎంపీటీసీ సభ్యుడు, కో ఆప్షన్ మెంబర్ మాత్రమే హాజరయ్యారు. సమావేశంలో కోరం లేకపోవడంతో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీవో వాయిదా వేశారు. అయితే 14 మంది ఎంపీటీసీలుబిఆర్ఎస్ ఎంపీపీ పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలియడంతో ముందుగానే ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జెడ్పి కార్యాలయంలో డిప్యూటీజెడ్పి సీఈఓ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా అమ్మలోని ఆర్డీవో కార్యాలయంలో ఎంపీపీ మహిపాల్ రెడ్డి పైఎంపీటీసీలు ఆర్డీవోకు అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. నిర్మల్ ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గెలుపొందడంతో ఆయా మండలాల్లో అవిశ్వాస తీర్మానాలకు సభ్యులు పూనుకుంటున్నట్లుతెలుస్తోంది.