Adll. Collector Khusbhu Guptha: ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి…

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని జామ్ని గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. మంత్రి సీతక్క కార్యక్రమాన్ని ప్రారంభించి, వెళ్లిపోయిన తరువాత అడిషనల్‌ కలెక్టర్‌ మండల స్థాయి అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అర్హులైన లబ్దిదారులంత దరఖాస్తు చేసుకునేలా అవగాహణ పెంచాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అడిషనల్‌ కలెక్టర్‌ వెంట ఎంపీడీవో గజానన్‌ రావ్, ఎంపీవో వెంకట రాజు, ఏవో వివేక్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *