సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఉత్తమ న్యాయవాదిగా జోండలే అజయ్ కుమార్
+ షబ్బీర్ అలీ చేతుల మీదుగా అవార్డు
+ అభినందించిన పలువురు న్యాయవాదులు, ప్రముఖులు
జిల్లా ఉత్తమ న్యాయవాదిగా ప్రముఖ న్యాయవాది, రిమ్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అజయ్ జోండలే ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పంద్రాగస్ట్ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఖానాపూర్ ఎఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, తదితరులు న్యాయవాది అజయ్‌కు అవార్డు అందజేసారు. ఈ సందర్భంగా న్యాయవాది అజయ్ సిరా న్యూస్‌తో మాట్లాడుతూ… ఉత్తమ న్యాయవాదిగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవలే రిమ్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా సైతం తనను నియమించడం జర్గిందని ఆయన అన్నారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని ఆయన పేర్కొన్నారు. కాగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్, ప్రధాన కార్యదర్శి ఎంబడి సంతోష్‌లకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాది అజయ్ కు పలువురు న్యాయవాదులు, నాయకులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.