సిరా న్యూస్, ఆదిలాబాద్:
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: న్యాయవాది అజయ్ జోందళే
+ మంత్రి సీతక్క సమక్ష్యంలో కాంగ్రెస్‌లో చేరిక
+ ఎంపీ అభ్యర్థి సుగుణక్క గెలుపుకోసం కృషీ చేస్తామని వెల్లడి
ప్రముఖ న్యాయవాది అజయ్ జోందళే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన ఆయన గతంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా న్యాయ సలహాదారులుగా సేవలందించారు. అంతకు ముందు బహుజన సమాజ్ పార్టీలో క్రియాశీలక నాయకునిగా, అనేక పదవుల్లో పనిచేసారు. బాబా సాహేబ్ అంబేడ్కర్ ఆశయాలను పునికి పుచ్చుకున్న ఆయన, అంతరాలు లేని సమసమాజ స్థాపన కోసం అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నిరుపేద ప్రజల సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని రత్న గార్డెన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టి బూత్ లెవల్ ఏజెంట్స్, కోఆర్డినేటర్ల సమావేశంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఆయనకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా న్యాయవాది అజయ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టి నిరుపేదల పార్టి అని అన్నారు. నిరుపేదల కోసం నిరంతరంగా తపించే కాంగ్రెస్‌లో చేరడం సంతోకరమని ఆయన అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, బోథ్ అసెంబ్లీ ఇంచార్జి ఆడే గజేందర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కంది శ్రీనివాస రెడ్డి, ఆడే గజేందర్‌ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణక్క గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషీ చేస్తానని ఆయన అన్నారు.