సిరా న్యూస్, ఆదిలాబాద్:
Advocate Jondale Ajay: రిమ్స్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ గా న్యాయవాది జొందలే అజయ్ కుమార్
ఉచిత, సమర్థవంతమైన న్యాయ సేవల పథకం- 2010 లో భాగంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో ఏర్పాటుచేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ కౌన్సిల్ గా ప్రముఖ న్యాయవాది జొందలే అజయ్ కుమార్ నియమితులయ్యారు. న్యాయవాది జొందలే అజయ్ కుమార్ ను లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా నియమిస్తూ, ఆదిలాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కె. ప్రభాకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జొందలే అజయ్ కుమార్ మాట్లాడుతూ… లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానెల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు, న్యాయ సలహాలు అవసరమైన నిరుపేదలకు ప్రాథమిక న్యాయ సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఈ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.