Adv. Sangem Sudheer Kumar: న్యాయ కోవిదుడు… రియల్‌ శ్రీమంతుడు…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

న్యాయ కోవిదుడు… రియల్‌ శ్రీమంతుడు…

+ సంగెం చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట సేవా కార్యక్రమాలు

+ ఆదర్శంగా నిలుస్తున్న న్యాయవాది “సంగెం సుధీర్‌ కుమార్‌”

‘సంగెం సుధీర్‌ కుమార్‌’ న్యాయవాదిగా ఆదిలాబాద్‌ వాసులకు చాల సుపరిచిమైన పేరు. ప్రస్తుతం ఆయన తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూనే.. నిరుపేదల కోసం నేనున్నాను అంటూ సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం అడెగామ–కే అనే మారుమూల గ్రామానికి చెందిన సంగెం గంగారాం, గిర్మాబాయి దంపతులకు జన్మించిన ఆయన తన స్వంత ఊరితో పాటు ఇతర గ్రామాల్లో సైతం సేవా కార్యక్రమాలు చేపడుతూ తన ఔనత్యాన్ని చాటుతున్నారు. గత 10ఏళ్లుగా తన తల్లి జ్ఞాపకార్థం సంగెం చారిటబుల్‌ ట్రస్ట్‌తో ఆపన్నులకు అండగా నిలుస్తూ, ప్రజల మన్నలను పొందుతున్నారు. 2014లో అప్పటి కలెక్టర్‌ ఆహ్మద్‌ బాబు చేతుల మీదుగా ఉత్తమ న్యాయవాది పురస్కారం అందుకున్న సంగెం సుధీర్‌ కుమార్, అతని సేవా కార్యక్రమాలపై “సిరా న్యూస్‌” స్పెషల్‌ స్టోరీ…

న్యాయవాదిగా రాణిస్తూనే ప్రజా సేవా…
చాలా మంది ఒక స్థాయికి వచ్చిన తరువాత ప్రజా సేవా కార్యక్రమాలు చేపడదామని, లేదంటే రిటైర్‌మెంట్‌ తరువాత సమాజం కోసం సమయం కేటాయిద్దామని అనుకుంటూ ఉంటారు. కానీ న్యాయవాది సుధీర్‌ కుమార్‌ మాత్రం తాను కోర్టులో కేసులు, క్లంట్‌లతో బిజీబిజీగా ఉన్నప్పటీకి సమాజ సేవా కోసం అనునిత్యం పాటుపడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆకలి విలువ తెలిసిన ఆయన ప్రతీ ఆదివారం ఆదిలాబాద్‌ పట్టణంలో నిరుపేదల కోసం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకు సముచితం స్థానం కల్పించాయి. పీఎంవో నుంచి ఆయనకు ప్రశంస పత్రం అందడంతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌లో ఆయన సేవా కార్యక్రమాలు పొందుపర్చడం జర్గింది. రాష్ట్రపతి కార్యాలయం సైతం ఆయన సేవలను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంగెం సేవలపై లేఖ రాయడం జర్గింది.

మచ్చుకు కొన్ని సేవా కార్యక్రమాలు…
ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ.. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న సంగెం సుధీర్‌ కుమార్‌ చేపట్టిన సేవా కార్యక్రమాల్లో కొన్నింటి పరిశీలిస్తే…


– తన స్వగ్రామమైన ఆడేగామ–కే లో తల్లి గిర్మాబాయి స్మారకార్థం శ్మశాన వాటికను నిర్మించారు.
– గ్రామంలో మత సామరస్యానికి ప్రతీక అయిన హస్సేన్, హుస్సేన్‌ దేవాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వడమే కాకుండా, తన స్వంత ఖర్చులతో ప్రధాన ద్వారం నిర్మించారు.
– గ్రామంలోని హనుమాన్‌ ఆలయానికి తన స్వంత డబ్బులతో స్లాబ్‌ వేయించారు.
– విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలతో పాటు నిరుపేదలకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తున్నారు.

మా అమ్మ గిర్మాబాయి స్పూర్తితోనే…
మాది నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడ, మా అమ్మ గిర్మాబాయి ఎప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుండేది. మా అమ్మ బ్రతికినంత కాలం తన వద్ద ఉన్న కొంతలోనే నలుగురికి సహాయం చేస్తూ జీవితం గడిపింది. ఆమె స్పూర్తితోనే నేడు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను. నిరుపేదలకు, అభాగ్యులకు సేవ చేసే అదృష్టం కలగడం నా పూర్వ జన్మ సుకృతంగా, తల్లిదండ్రుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను. సంగెం చారిటబుల్‌ ట్రస్ట్‌ను మరింత విస్తరించి, సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను.

–సంగెం సుధీర్‌ కుమార్, ప్రముఖ న్యాయవాది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *