సిరా న్యూస్, గుడిహత్నూర్:
గుడిహత్నూర్ లో జోరుగా ఇంటింట ప్రచారం
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఇంటింట ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను గురించి వివరించారు. బీజేపీ మత రాజకీయాలతో ప్రజలంత విసిగిపోయారని, ఈ సారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖామయని పలువురు మాట్లాడారు. బీజేపీ హయాంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని అన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతీ ఒక్కరు చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ యువ నాయకులు అజయ్ కుమార్ జొండలే ఈ ప్రచార కార్యక్రమంలో జోరుగా పాల్గొని, కాంగ్రెస్ పార్టీ పథకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మెన్ ఆడె షీల, కాంగ్రెస్ నాయకులు అంకతి రవి, మాధవ్ ససానే, మస్కే మాధవ్, మహేందర్, శ్రీకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.