సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించాలి…
ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు ఓటు వేసి అత్రం సుగుణను ఎంపీగా గెలిపించాలని ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ యువ నాయకులు అజయ్ కుమార్ జొండలే అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రములో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పథకాలను గురించి వివరించారు. గడిచిన 10 ఏళ్లలో మత రాజకీయాలు చేయడం తప్ప, బిజెపి ప్రభుత్వం సామాన్యులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 న్యాయాలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు బిజెపి బీఆర్ఎస్లను నమ్మి మరల మోసపోవద్దని అన్నారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చడం ఖాయమని పేర్కొన్నారు. దేశంలో రిజర్వేషన్లు ఉండాలన్నా… కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ విచార్ విభాగ్ కన్వీనర్ తుల అరుణ్, మండల అధ్యక్షులు మల్యాల కరుణాకర్, మాజీ AMC ఛైర్మన్ ఆడే షీలా, మాజీ జడ్పీటిసి మస్కే మాధవ్, నాయకులు అంకత్ రవి, నాగ్నాథ్ అప్పా, మాధవ్ ససానే, దళిత్ గాయ్ కాంబ్ల్, తరుణ్ గిట్టే కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.