సిరా న్యూస్, డిజిటల్:
తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా న్యాయవాది ఎన్రాల నగేష్
+ వరుసగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన నగేష్
+ అభినందనలు తెలిపిన పలువురు న్యాయవాదులు, నాయకులు
ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ఎన్రాల నగేష్ తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యులు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. వరుసగా మూడుసార్లు ఆదిలాబాద్ బార్ అధ్యక్షులుగా గెలుపొంది రికార్డు స్వంతం చేసుకున్న ఆయన, తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ కు సైతం వరుసగా మూడోసారి ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడి హ్యాట్రిక్ సాధించారు. తెలంగాణ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడిన సందర్భంగా పలువురు న్యాయవాదులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.