Advocates: ఎంబడి సంతోష్, రాహుల్‌ వాగ్మారేలకు ఘన సన్మానం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

ఎంబడి సంతోష్, రాహుల్‌ వాగ్మారేలకు ఘన సన్మానం

ఇటీవల నిర్వహించిన ఆదిలాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన న్యాయవాది ఎంబడి సంతోష్, జాయింట్‌ సెక్రెటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్‌ వాగ్మారేలను ఘనంగా సన్మానించారు. మంగళవారం ఆదిలాబాద్‌ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్‌ రిటైర్డ్‌ ఈడీ ఉప్రే పుండలిక్, నాయకులు మేకల మల్లన్న, లక్ష్మణ్‌లు పూలమాల, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జోందలే అజయ్‌ కుమార్, రాఠోడ్‌ సుభాష్, గణేష్‌ మెకానే, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *