సిరా న్యూస్, భీమదేవరపల్లి:
నీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు… మిషన్ భగీరథ ఏఈ సాయికృష్ణ…
హన్మకొండ జిల్లాలోని హుస్నాబాద్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మిషన్ భగీరథ ఏఈ సాయి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ… గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి మొదటి వారంలో మండలాల వారిగా గ్రామీణ నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ గ్రామస్థాయి సిబ్బందితో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో చేతిపంపుల రిపేర్లు, మిషన్ భగీరథ పైప్ లైన్ల మరమ్మత్తులు, తదితర అంశాలపై ఇప్పటి నుండే సంబంధిత అధికారులతో చర్చి అన్నారు. ఏడాది వేసవికాలం లో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామని ఆయన అన్నారు.