సిరా న్యూస్, భీమదేవరపల్లి
ఆన్‌లైన్‌లో పంటల వివరాలు నమోదు
* వ్యవసాయ అధికారి అఫ్జల్ పాషా
హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ప్రస్తుతం యాసంగిలో సాగవుతున్న పంటల వివరాలను వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్లు వ్యవసాయ అధికారి అఫ్జల్ పాషా తెలిపారు. గత కొద్ది రోజుల నుండి గ్రామాలలో ఏఈవోలు పర్యటిస్తూ సర్వే నెంబర్లు సాగు చేస్తున్న పంటలు వారిగా వివరాలు సేకరిస్తున్నారు. భీమదేవరపల్లి మండలం లోని 6 క్లస్టర్ల వ్యవసాయ పంటల నమోదు వివరాలను ఆన్లైన్లో పక్కాగా పొందుపరిచినట్లు మండల వ్యవసాయ అధికారి ఎండి అఫ్జల్ పాషా స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా ఈపాటికి 16,267 ఎకరాల పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు..