సిరా న్యూస్,హయత్ నగర్;
హయత్ నగర్ ప్రభుత్వ స్కూల్ ముందు బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. స్కూల్ లో ఉన్న వారి నిర్లక్ష్యం వల్లే తమ బాబు అజయ్ చనిపోయాడు అంటూ ఆందోళన చేసారు. స్కూల్ గేట్ వెల్డింగ్ ఊడిపోయినా ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. చాలా రోజుల నుంచి గేటు తుప్పు పట్టి పోయిన పట్టించుకోలేదు. నిర్లక్ష్యం వహించిన స్కూల్ హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేసారు. హయత్ నగర్ బిజెపి కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి అందోళనకు మద్దతు తెలిపారు. అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు. .