వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్దుల అందోళన

సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం కు చెందిన 100 ఎకరాలను హైకోర్టు నూతన భవన నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కాగా వ్యవసాయ పరిశోధనలు నిర్వహిస్తున్న భూములను హైకోర్టు భవన నిర్మాణం కోసం కేటాయించడం సరికాదు అంటూ విద్యార్థులు పేర్కొంటున్నారు. హైకోర్టు నూతన భవనం కోసం స్థలం కేటాయించడం సమంజసమే అయినప్పటికీ అది వ్యవసాయ, ఉద్యానవన పంటల కోసం పరిశోధనలు నిర్వహిస్తున్న స్థలాన్ని కేటాయించడం ఎంతవరకు సమంజసం అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే 55 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రనగర్ లోని వ్యవసాయ వర్సిటీ పరిపాలన భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.దీంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు విద్యార్థులను అదుపులకు తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *