సిరాన్యూస్: ఓదెల
రేషన్ కార్డు లేని రైతులు వివరాలు అందజేయాలి : మండల వ్యవసాయ అధికారి బి. భాస్కర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు పంట రుణ మాఫీ పథకం కోసం రేషన్ కార్డు లేని లబ్ధిదారుల వివరాలను అందజేయాలని వ్యవసాయ అధికారి బి భాస్కర్ అన్నారు. శుక్రవారం ఓదెల మండల కేంద్రం లో ని రైతువేదిక లో మండల వ్యవసాయ అధికారి బి భాస్కర్ రైతు రుణ మాఫీ అప్ లో నమోదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలం లో 998 మంది రైతులు రేషన్ కార్డు లేని వారీగా గుర్తించడం జరిగింది అన్నారు. వారి వివరాలు గ్రామాల వారీగా షెడ్యూల్ చేసి ప్రత్యేక ఆప్ లో నమోదు చేస్తున్నామన్నారు. షెడ్యూల్ లో తెలిపిన గ్రామాల లో కూడా మిగతా గ్రామాల రైతులు సంబంధిత దరఖాస్తు ఫారం తో వచ్చి నమోదు చేసుకోవచ్చు అన్నారు.రేషన్ కార్డు లేని రైతు తమ వివరాలను వెంటనే నమోదు చేసుకుంటే వెంటనే వారి వివరాలు ప్రభుత్వానికి పంపిస్తాం అని అన్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్ ఈ విధంగా ఉన్నాయి తెలిపారు.రేషన్ కార్డు లేని రైతులు తమ వివరాలను వెంటనే నమోదు చేసుకోవాలని తెలిపారు.