సిరా న్యూస్,వికారాబాద్ ;
చికిత్స ద్వారా హెచ్ఐవి ని కొంతమేరకు నియంత్రించవచ్చని, ఎయిడ్స్ కు అవగాహనే సరైన మందు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. నేడు వికారాబాద్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వికారాబాద్ జిల్లా శాఖ మరియు సత్య సాయి సేవ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా విశ్వ భారతి డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన వారు ఏమాత్రం అధైర్య పడకుండా జీవితము సాగించవచ్చని, దీని నివారణకు పరిశోధనలు పురోగతి ఉన్నప్పటికిని నేటికీ సురక్షితమైన, శక్తివంతమైన టీకా అందుబాటులోనికి రాలేదని, అవగాహనే దీనికి సరైన మందు అని సాయి చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి సోకే మార్గాలు తెలుసుకుని జాగ్రత్త పడటం ద్వారా ప్రతి మనిషి తనను తాను కాపాడుకోవచ్చని, సురక్షితమైన లైంగిక సంపర్కము, కండోమ్ వాడకము ద్వారా దీనిని అడ్డుకోవచ్చని వికారాబాద్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమమునకు వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్, విశ్వ భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, బసవరాజ్, కళాశాల సిబ్బంది మరియు కళాశాల విద్యార్థులు, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.