సిరాన్యూస్, కరీంనగర్
ఏఐఎఫ్‌డీఎస్ జాతీయ జనరల్ బాడీ సమావేశం పోస్టర్ ఆవిష్కరణ
*ఉమ్మడి జిల్లా కన్వీనర్ గడ్డం శ్రీకాంత్
ఆగస్ట్ 1,2 తేదీలలో జరిగే ఏఐఎఫ్‌డీఎస్ జాతీయ జనరల్ బాడీ సమావేశాలను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా కన్వీనర్ గడ్డం శ్రీకాంత్ అన్నారు. గురువారం కరీంనగర్‌లోని ఎస్ఎంహెచ్ బాయ్స్ హాస్టల్ లో ఏఐఎఫ్‌డీఎస్ జాతీయ జనరల్ బాడీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓంకార్ భవనం బి ఎన్ హాల్ బాగ్ లింగంపల్లి హైదరాబాద్ లో జరగబోయే జాతీయ జనరల్ బాడీ సమావేశానికి 12 రాష్ట్రాల నుండి ప్రొఫెసర్ విద్యామంతులు మేధావులు వస్తున్నారని అన్నారు. విద్యార్థులకుపెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రనికి ప్రభుత్వం విద్యకు కేవలం 30శాతం నిధులు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటన్నారు. 2009 విద్య హక్కు చట్టంలోని సెక్షన్ 121 సి ప్రకారం ప్రవేట్ పాఠశాలలో నిరుపేదలకు విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని నిబంధనలు పట్టించుకోని ప్రవేట్ పాఠశాలలపై యజమాన్యాలపై విద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. జీవో నెంబర్ 91 విరుద్ధంగా పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ యూనిఫార్మ్స్, అమ్మకాలు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పాఠశాలలో కనీస విద్యా బోధన లేని సిబ్బందితో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను బోధిస్తున్నారు. మరికొన్ని ప్రైవేట్ కాలేజీ, స్కూల్లల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి కోరారు. అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి అన్నారు. సాంఘీక సంక్షేమ ప్రభుత్వ గురుకుల హాస్టల్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి సొంత భవనాలు నిర్మించాలని హాస్టల్లో విద్యార్థులకు మెస్ మరియు కష్టమెటిక్ చార్జీలను పెంచాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన అన్నారు. పేపర్ లీకేజీలకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు బొల్లుమల్ల చందు, మహేష్, అంబాల సంతోష్, చింటూ, రాజశేఖర, రఘువరన్, తదితరులు పాల్గొన్నారు.