Ailaiah Yadav: ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

 సిరా న్యూస్, ఓదెల
ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
* భ‌క్తుల‌కు స్వీట్లు పంపిణీ చేసిన గుండేటి ఐలయ్య యాదవ్

పెద్దపెల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి , మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ శ్రీధర్ బాబు ఓదెల మల్లన్న ఆశీస్సులతో ఆయుఆరోగ్యాలతో , సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో మల్లన్న దీవెనలతో ముందు ఉంచాలని కోరుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్‌గా ఉండి ఉద్యమకారుల అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చడంలో శ్రీధర్ బాబు పాత్ర కీలక అని అన్నారు. జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ ఉద్యమకారులు అందర్నీ సన్మానిస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉద్యమకారుల ఫోరం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపెల్లి జిల్లా ఉద్యమకారుల చరిత్ర పై రూపొందించిన పుస్తకాన్ని జూన్ 2న ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జంగం కొమరయ్య , పత్తి తిరుపతి రెడ్డి , గోలి మోహన్ కుమార్ , సూత్రాల మల్లేష్ , పత్తి కుమార్ రెడ్డి , కొమురయ్య , అలివేలు రవీందర్ రెడ్డి , తొట్ల కృష్ణ , ఒగ్గు కృష్ణ , గెల్లుశేఖర్ రమేష్ , సత్యనారాయణ ,గడ్డం బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *