సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకుల ధర్నా
* ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
* ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడ
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడ అన్నారు. గురువారం కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని ఏవో సూరికి అందజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం పున: ప్రారంభించాలన్నారు. పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని అన్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నవీన్ శైలు, స్రవంతి , సహాయ కార్యదర్శి అజయ్, పట్టణ అధ్యక్షుడు హర్షవర్ధన్, ఉపాధ్యక్షుడు సాయి పవన్ మని, సహాయ కార్యదర్శి శ్రీహరి, తదితర విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు.