సిరాన్యూస్, ఇచ్చోడ
ఈనెల 26న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయండి
* ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య
భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఈనెల 26న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు కార్మికులంతా భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులందరూ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బిల్డింగ్ కన్సస్ వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి లింగు పెయింటర్ సంఘం మండల అధ్యక్షుడు అర్జున్ విలాస్, ఆశన్న జైనథ్ మండల అధ్యక్షుడు, సీపీఐ సీనియర్ నాయకులు ఎస్.కె ఆభేద్ అలీ, బజార్‌హత్నూర్ మండల సెక్రెటరీ కీర్తి రమణ, భవన నిర్మా కార్మికులు పాల్గొన్నారు.