విధ్వంసం మిగిల్చిన ఆకేరు వాగు

సిరా న్యూస్,మహబూబాబాద్;
మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు విధ్వంసం సృష్టించింది. నెల్లికుదురు, నరసింహులపేట, చిన్న గూడూరు,మరిపెడ, డోర్నకల్ మండలాల్లో చాలా రోడ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లతో పాటు వేల ఎకరాల పంటపొలాలు నేలమట్టం అయ్యాయి. 90 కిలోమీటర్ల మేర ఆకేరు వాగు పరివాహక ప్రాంతాలు బీభత్సం సృష్టించింది. జనగామ జిల్లాలోని జఫర్గడ్ మండలంలో మొదలయ్యే ఆకేరు వాగు వరంగల్-మహబూబాబాద్ జిల్లాల మీదుగా ఖమ్మం వరకు వరదలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని చాలా చెరువులు తెగి ఆకేరు వాగులోకి వరద చేరింది. 200 మీటర్ల మేర పురుషోత్తమ్మయ్యగూడెం బ్రిడ్జి వద్ద మరిపెడ-కురవి ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. రోడ్డు పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *