Akshay: అనుమ‌తి లేని పాఠ‌శాల‌ల‌ను మూసి వేయాలి:  ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్

సిరా న్యూస్, బేల‌
అనుమ‌తి లేని పాఠ‌శాల‌ల‌ను మూసి వేయాలి:  ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్
ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో డీఈఓకు విన‌తి ప‌త్రం అంద‌జేత‌

ఆదిలాబాద్ జిల్లాలో అనుమ‌తి లేకుండా నిర్వ‌హిస్తున్న పాఠ‌శాల‌ల‌ను వెంట‌నే మూసి వేయాల‌ని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ అన్నారు. శ‌నివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో డీఈఓకు వినతి పత్రం అంద‌జేశారు. ఈసంద‌ర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడారు.ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజుల పేరుతో తల్లిదండ్రుల రక్తాన్ని పీలుస్తున్నార‌ని ఆరోపించారు. ఇలాంటి పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని కోరారు.ఆదిలాబాద్ జిల్లలో కొత్తగా నియమిస్తూ పాఠశాలను ప్రారంభిస్తున్నటువంటి యజమానులపై అలాగే ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న పాఠశాలను వెంటనే మూసివేయాల్సిందిగా కోరారు.ఇకపై ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫామ్, షూస్ అమ్మడం నిషేధమ‌ని, ప్రతి పాఠశాలకు నోటీసులు పంపాలని అన్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, కార్తీక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *