Akshay: పెండింగ్ స్కాల‌ర్‌షిప్‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి :ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ 

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
పెండింగ్ స్కాల‌ర్‌షిప్‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి :ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ 
క‌లెక్ట‌రేట్ ఎదుట ఏబీవీపీ నాయ‌కుల ధ‌ర్నా

పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ ఖడ్సే అన్నారు. బుధ‌వారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ కలెక్టరేట్ కార్యాల‌యాన్ని ముట్టడించారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ మాట్లాడుతూ గత ప్రభుత్వ మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని అన్నారు. విద్యాశాఖకు మంత్రిని కూడా నియమించకుండా ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందని ఆరోపించారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేప‌డుతామ‌ని తెలిపారు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రజా పాలన ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేష్, నిఖిల్, విగ్నేష్, కార్తీక్, ఉదయ్, శివ సాయి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *