-భక్తిశ్రద్ధలతో పాల్గొన్న శ్రీరామ కాలనీ వాసులు
సిరా న్యూస్,మంథని;
మంథని పట్టణంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి మంథని పట్టణంలోని శ్రీరామ కాలనీ వాసుల ఆధ్వర్యంలో భక్తులు అయోధ్య శ్రీసీతారాముల అక్షింతలను మంగళవారం శోభయాత్రతో తరలితీసుకువెళ్లారు. మేళతాళాలతో శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ అక్షింతల కలశాలను శిరస్సుపై పెట్టుకుని భక్తి పారవశంతో తరలించారు. అయోధ్య రామతీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొద్దిరోజులుగా స్వామివారి అక్షింతలను వాడవాడలో భక్తుల ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు కొత్త శ్రీనివాస్, గర్రెపల్లి వెంకన్న, కనుకుంట్ల స్వామి, శ్రీరామ కాలనీ వాసులు ఐలి సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్,రాఘవరెడ్డి, యాదగిరిరావు, గోపాలరావు, దిలీప్ రావు, సిరిపురం సురేష్, లక్ష్మణ్ ,సోమారపు శేఖర్ ,బొడ్డు రమేష్ ,సురేష్ రావు లతోపాటు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు