Akula Mahender: కాంగ్రెస్‌లో చేరిన ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్

సిరా న్యూస్, ఓదెల
కాంగ్రెస్‌లో చేరిన ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్

ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, లాఠీ దెబ్బలకు సైతం తట్టుకొని నిలిచిన ఉద్యమకారుడు మహేందర్. మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినా ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఓదెల గ్రామానికి రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నిక‌య్యారు. సోమవారం ఉదయం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో శివ పల్లి వారి నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరి వెంట అప్పని తిరుపతి నూతిశంకర్, వంగ రాజమల్లు, పందేన నరసింగం ఉన్నారు. కార్యక్రమంలో ఓదెల కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, చీకట్ల మొండయ్య, పిట్టల నరసింగం, గోపు నారాయణరెడ్డి, ఓదెల మండల కాంగ్రెస్ నాయకులు. తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *