ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాలలో జయంతి, వర్థంతి వేడుకలలో పలువురు నివాళులు
సిరా న్యూస్,జగిత్యాల;
తెలంగాణ అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ అని, ఆయన రచనలు భవిష్యత్తు తరాలకు అక్షర కరదీపికలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
శుక్రవారం జగిత్యాల పట్టణ అంగడి బజార్ లో అలిశెట్టి విగ్రహం వద్దఅలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్థంతి నేటి నిర్వహించగా, ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత- సురేష్ ,తోపాటు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బీజేపీరాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి లు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు..ఆనంతరం జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజం కోసం తండ్లాడిన అలిశెట్టి జయంతి, వర్ధంతి ఒకటేరోజు కావడం యాదృచ్చికమే అయినా, మరణం నా చివరి చరణం కాదని ఆయన చేసినధోరోదాత్త ప్రకటన ప్రతి లక్ష్యసాధకుడికి స్ఫూర్తి నింపాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని పోవాలనిసూచించారు.. అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల కు చెందిన వారు కావడం మన అదృష్టమన్నారు. ఆయన రచించిన కవితలు జనాన్ని జాగృతం చేయాలన్నారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్,స్థానికకౌన్సిలర్ అడువాల జ్యోతి లక్ష్మణ్,కమిషనర్ అనిల్ బాబు,డీఈ రాజేశ్వర్,నాయకులు బాలే శంకర్ ,వల్లేపు మొగిలి,
తాండ్ర సుధీర్,గౌరీ శ్రీనివాస్,అబ్దుల్ అజీజ్,వేణు మాధవ్,పెండెం గంగాధర్,శేఖర్,యూత్ అధ్యక్షులుకత్రోజ్ గిరి,కూతురు శేఖర్,మహేష్,,తదితరులు పాల్గొన్నారు.