మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి -లక్ష్మణ్
సిరా న్యూస్,జగిత్యాల;
పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నుండి ప్రారంభమైన నైపద్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి – లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఈద్గా, మసీద్ ల వద్ద చైర్ పర్సన్ జ్యోతి పర్యటించి, మసీద్ కమిటీలకు
డస్ట్ బిన్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మున్సిపల్ లో సంబంధిత శాఖలకు కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. మసీదుల, స్మశాన వాటికల , ఈద్గాల వద్ద వద్ద పటిష్టమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, మంచినీరు సౌకర్యం కల్పించాలని, విధి దీపాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యుత్తు అంతారాయం లేకుండా చూడాలని, ముఖ్యంగా ప్రార్థన సమయాల్లో విద్యుత్ ప్రసారం ఉండేలా చూడాలని ఆదేశించారు. వార్డులో మంచినీరు ఏ సమయానికి ఏ ప్రాంతంలో ఇస్తున్నారనేది ప్రజలకు తెలిసే విధంగా చేయాలని, మంచినీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సిరాజుద్దీన్ మన్సూర్, నేహాల్, భారీ, కమల్, అడువాల లక్ష్మణ్, ఇర్ఫాన్, జుల్ఫ్ ఖార్ , తదితరులు పాల్గొన్నారు..
=======================