సిరా న్యూస్, ఖానాపూర్:
ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆరు గ్యారెంటీల కోసం గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబం ప్రజా పాలనలో దరఖాస్తులు అందించాలని ఖానాపూర్ ఎంపీడీవో మల్లేశం అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అడవి సారంగాపూర్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, ఇతర అధికారులతో కలిసి ప్రజాపాలన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడావి జంగుబాయి, పంచాయతీ కార్యదర్శి గంగాదేవి, ఉప సర్పంచ్ సీడం మారుతి, నాయకులు అత్రం భీమ్ రావ్ పటేల్, సిడం సోనేరావు, లింగు పటేల్, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.