రెవెన్యూ కను సన్నల్లో పట్టణ నిర్మాణాలు
జాతీయ రహదారి – 67 పక్కనే నిర్మాణాలు
అడిగేవారు లేరు అడ్డుకునే వారు లేరు
దాదాపు 10 కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు
ఎక్కువ శాతం నకిలీ ఇంటి పట్టాలు
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ పట్టణం బద్వేలు గోపవరం మండలాల జంట కలయిక బద్వేల్ కు 5 కిలోమీటర్ల కేవలం దూరంలో గోపవరం మండలం ఉంది గోపవరం మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే దాదాపు 95 శాతం మంది ఉద్యోగులు సిబ్బంది బద్వేల్ లోనే నివాసం ఉంటారు గోపవరం రెవెన్యూ కార్యాలయం జాతీయ రహదారి – 67 పక్కనే ఉంది గత రెండు వారాలుగా గోపవరం రెవెన్యూ కార్యాలయం కూతవేటు దూరంలో జాతీయ రహదారి పక్కన కబ్జాదారులు ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు దౌర్జన్య పూర్వంగా జరుగుతున్న ఇంటి నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు సిబ్బంది కన్నెత్తి చూడలేదు ఇప్పటికీ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి అక్రమ నిర్మాణాలపై నాలుగు రోజుల క్రితం సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు వెంటనే చర్యలు తీసుకుంటామని మండల తాసిల్దార్ చెప్పినప్పటికీ ఆచరణలో ఏమాత్రం ముందడుగు పడలేదు అక్రమ నిర్మాణాల గురించి అధికారులకు ఫిర్యాదు చేయవలసిన సంబంధిత వీఆర్వో ఎందుకు పట్టించుకోవడం లేదు ఎవరికి అంతుచిక్కడం లేదు భారీ స్థాయిలో ముడుపులు దండుకొని రెవిన్యూ సిబ్బంది అటువైపు వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తున్నారు దాదాపు రెండు కోట్ల రూపాయలు మేరకు చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి అందుకు తగ్గట్టుగానే రెవెన్యూ అధికారుల నడవడిక ఉంది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ అప్పటి రాజంపేట ఆర్డిఓ ప్రభుత్వ అవసరాల దృష్ట్యా వాటిని రద్దు చేశారు కానీ ఈ విషయం బయట పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం గోపవరం మండలం గోపవరం గ్రామపంచాయతీ సర్వే నెంబర్లు 119 64 65 లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి
రెవెన్యూ అధికారులకు సిబ్బందికి అంతా తెలిసే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్రమ నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికపై నిలిపివేయాలని మండల ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్న అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు ఇంటి పట్టాలు ఉంటే వాటిని అధికారులకు చూపవలసిన బాధ్యత నిర్మాణ దారులకు ఉంది నిర్మాణాలు చేస్తున్నవారు ఆర్థికంగా బలవంతులు అని చెప్పాలి ఆర్థికంగా అన్నీ ఉన్న వీరికి అధికారులు ఎలా ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చారు అనేది ప్రశ్న ఎప్పుడో రద్దు చేసిన ఇంటి పట్టాలు అడ్డుపెట్టుకొని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు వీటిలో చాలావరకు నకిలీ ఇంటి పట్టాలు ఉన్నట్లు సమాచారం ఈ విషయాన్ని
అక్రమ నిర్మాణాలు చేస్తున్న కొందరు అంగీకరిస్తున్నారు బద్వేలు గోపవరం మండలాల్లో నకిలీ ఇంటి పట్టాలు ఎప్పటినుంచో రాజ్యం ఏలుతున్నాయి ఈ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఎవరిని ఆదర్శంగా తీసుకొని జాతీయ రహదారి పక్కన మరో పట్టణాన్ని నిర్మిస్తున్నారో అంతు చిక్కడం లేదు దాదాపు 10 కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ స్థలం ఇప్పుడు కబ్జాదారుల పరమైంది అందులో రెండు కోట్ల రూపాయలు రెవెన్యూ అధికారులకు సిబ్బందికి ముడుపుల రూపములో వెళ్లినట్లు సమాచారం