వైద్య సేవలు అందక రోగుల ఇక్కట్లు
ట్రైబల్స్ అలవెన్స్ తోపాటు జీతాలు అందుకుంటున్న వైద్యులు
జీతాలేమో ఇక్కడ… విధులు నంద్యాలలో …
సిరా న్యూస్,ఆళ్లగడ్డ;
ప్రభుత్వ వైద్యశాలల్లో వివిధ ప్రాంతాల నుంచి వైద్యం కొరకు వచ్చే పేద ప్రజల సౌకర్యార్థం వారి ఆరోగ్య సంరక్షణకై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రులు సేవలు అందించాల్సి ఉండగా ఆళ్లగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రం (సిఎస్ సి)లో పనిచేస్తున్న కొంతమంది వైద్యులుతమ వ్యక్తిగత కారణాలవల్ల ఆళ్లగడ్డ వైద్యశాలలో రోగులకు వైద్య సేవలు అందించకుండా డిప్యూటేషన్ పై వేరే ప్రాంతాలకు వెళ్లడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందడం లేదని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రికి చెందిన డి సి ఎస్ జనరల్ సర్జరీ వైద్యురాలు షేక్ శబ్నం, క్యాష్ ఆర్తోపెడిక్ ( సి ఏ ఎస్) డి సి హెచ్ ఎస్. వైద్యులు మహమ్మద్ జఫ్రుల్లా లు డిప్యూటేషన్ పై గత కొంతకాలంగా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో అన్ని రకాల జబ్బులకు సంబంధించి రోగులకు మెరుగైన వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందకపోవడంతో పేద మధ్యతరగతి రోగులు ఆర్థిక భారమైన సరే అప్పులు చేసి ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం 50 పడకల ఆరోగ్య కేంద్రంగా ఇటీవల రూపుదిద్దుతుంది. ఆళ్లగడ్డ ఆసుపత్రికి ప్రతిరోజు 250 నుంచి 350 పైగా ఓపీలు నమోదు అవుతాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎక్కువ శాతం పేద మధ్య తరగతికి చెందిన గిరిజన ప్రాంతం. ప్రభుత్వం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలను ట్రైబల్స్ ఏరియాగా గుర్తించింది. ఇక్కడ పనిచేసే ప్రభుత్వ వైద్యులకు ప్రత్యేకంగా ట్రైబల్స్ అలవెన్స్ తో పాటు మెరుగైన జీతాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిప్యూటేషన్ పై నంద్యాలకు వెళ్లిన వైద్యులు షేక్ శబ్నం, మహమ్మద్ జఫ్రూల్లా లు ఆళ్లగడ్డ సి ఎస్ సి లో పనిచేసే వైద్యులకు వర్తించే ట్రైబల్ అలవెన్స్ రాయితీలు పొందుతున్నారు. జీతాలు ఏమో ఇక్కడ విధులు ఏమో నంద్యాలలో నిర్వర్తించే వారికి ట్రైబల్స్ అలవెన్స్ రాయితీలు ఎలా వర్తిస్తాయని ఆళ్లగడ్డ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటేషన్ పై వెళ్లిన వైద్యుల స్థానంలో రోగులకు సేవలందించేందుకు ఇంతవరకు వైద్యులను ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు కేటాయించకపోవడం పట్ల వైద్యుల కొరత వల్ల రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందడం లేదని ఆసుపత్రికి వచ్చే పేద మధ్యతరగతిరోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైంది వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికి అక్కడే నీళ్లు నిలవడంతో దోమలు విజృంభిస్తున్నాయి ఫలితంగా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గున్య తదితర వైరల్ జ్వరాల కేసులతో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాల తొ పాటు నియోజకవర్గ వ్యాప్తంగా యెనిమిది పీహెచ్ఈ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు విష జ్వరాలు భయపడుతున్న వర్షాకాలం మొదలు కావడంతో రకరకాల వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి దోమలే వానాకాలంతో వ్యాధులు వ్యాప్తికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు డిప్యూటేషన్ పై వెళ్లడంతో ఆసుపత్రిలో వైద్యుల కొరత అధికంగా ఉంది. ఇక్కడ వీధుల్లో ఉన్న వైద్యులపై పనిభారం పెరిగిపోతుంది. ఇప్పటికైనా వైద్య ఉన్నతాధికారులు స్పందించి ఆళ్లగడ్డ ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా డిప్యూటీ ఇక్కడ పనిచేసే డిప్యూటేషన్ పై వెళ్లిన వైద్యుల డిప్యూటేషన్ రద్దుచేసి ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి పంపించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.