సిరాన్యూస్, బేల
రక్తదానం చేసిన ఏల్మ అమరేందర్ రెడ్డి
* సామ రూపేష్ రెడ్డికి అభినందనలు తెలిపిన కుటుంబీకులు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సోన్ కాస్ గ్రామానికి చెందిన సిడం ఈశ్వర్ గత నెల రోజులుగా రక్తహీనతతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బాధితునికి రక్తం అవసరమని వైద్యులు గురువారం కుటుంబ సభ్యులకు సూచించగా ఆయనకు అవసరమైన బి పాజిటివ్ రక్తం కోసం కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నించారు.ఈ క్రమంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ని కుటుంబ సభ్యులు సంప్రదించగా వెంటనే స్పందించిన ఆయన ఇదే మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన ఏల్మ అమరేందర్ రెడ్డి అనే యువకుడిని రక్తదానం చేయవలసిందిగా కోరారు. వెంటనే ముందుకు వచ్చిన ఏల్మ అమరేందర్ రెడ్డి బాధితునికి అవసరమైన బి పాజిటివ్ రక్తాన్ని అత్యవసర సమయంలో అందజేశారు.దీంతో బాధితునికి వైద్యులు రక్తం ఎక్కించారు. అయితే తనను సంప్రదించిన వెంటనే స్పందించి రక్తదానం చేసేలా కృషిచేసిన సామ రూపేష్ రెడ్డికి బాధితుని కుటుంబ సభ్యులు సిడం సాయి,మనోజ్ కృతజ్ఞతలు తెలుపగా సదరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు సామ రూపేష్ రెడ్డిని అభినందించారు. అత్యవసర సమయంలో రక్తం దానం చేసి ప్రాణాలను కాపాడాలని యువకులకు పిలుపునిచ్చారు.మానవతా దృక్పథంతో అత్యవసర సమయంలో రక్తదానం చేసే సామ రూపేష్ రెడ్డి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన భవిష్యత్తులో పేద ప్రజలకు అండగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆయనతో పాటు రక్త నిది సిబ్బంది అశోక్,సత్యనారాయణ పాల్గొన్నారు.