Amarveni Narsagoud: రాజ‌కీయ పార్టీలు రాష్ట్ర అధ్యక్ష ప‌ద‌వులు బీసీలకు కేటాయింటాలి:  అమరవేణి నర్సాగౌడ్

సిరాన్యూస్‌, ఖానాపూర్
రాజ‌కీయ పార్టీలు రాష్ట్ర అధ్యక్ష ప‌ద‌వులు బీసీలకు కేటాయింటాలి:  అమరవేణి నర్సాగౌడ్

రాజ‌కీయ పార్టీలు రాష్ట్ర అధ్యక్ష ప‌ద‌వులు బీసీలకు కేటాయింటాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్ అన్నారు. శ‌నివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళుల‌ర్పించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 52 శాతం గల బీసీ లకు కాంగ్రెస్ , బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించి వారి చిత్త‌శుద్ధిని నిరూపించుకోవాల‌న్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బీసీ వాదంతో ముందుకు వచ్చి బీసీ ల ఓట్లు వేయించుకొని బీసీల‌ను అన్ని రంగాలలో అణ‌చి వేస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించి తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డను ఏర్పాటు చేయాల‌ని, అలాగే వారికీ గుర్తింపు కార్డులు ఇచ్చి గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 250 గజాల ఇంటి స్థలాలను కేటాయించాల‌ని కోరారు. 25 వేల పెన్షన్ లను మంజూరి చేసి ఉచిత వైద్య , బస్ సౌకర్యం కలిపించాలి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మృతి చెందిన వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పురస్తు శంకర్, జిల్లా నాయకులు ఓల్లెపు తిరుపతి, కోమిరే రమేష్, పల్లపు నర్సింలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, మమ్మద్ ఫీర్దోస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *