సిరాన్యూస్, సైదాపూర్:
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత : గ్రామశాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్ కుమార్
సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో 34500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు రాదారపు మల్లమ్మ కు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకి బాసటగా నిలవడం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ మండల అధ్యక్షుడు ఆసరి రఘు యాదవ్, ఎండి దస్తగిరి, మేకల క్రాంతి కుమార్, చల్లూరి రవీందర్, గాజర్ల రమేష్, ఇల్లందు సంపత్, ఆసరి రాజు, పడాల తిరుపతి, ఆర్ఎంపి చింతల జగన్ , గుమ్మడి శ్రీనివాస్, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.