సిరాన్యూస్, భీమదేవరపల్లి
అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
*తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాల ప్రకాష్
విజయవాడ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాల ప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరచడం ఈ దేశానికి సిగ్గుచేటన్నారు. వెంటనే ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు స్పందించాలన్నారు. మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా పూర్తి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్, పిఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అంబాల చక్రపాణి, బీసీ సంఘం నాయకులు వేముల జగదీష్, కండే చిరంజీవి, సిర్సు హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.