సిరాన్యూస్ , భీమాదేవరపల్లి
హైడ్రా పని తీరు సూపర్ : తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
హైడ్రా పని తీరు పై తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ ప్రశంసలు కురిపించారు. శుక్రవారం భీమాదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ, ప్రజాప్రతినిధులు అక్రమంగా చెరువులలోనే ఇళ్లు కడితే నీళ్లు ఎక్కడికి వెళతాయని ప్రశ్నించారు. హైడ్రా ఏర్పాటుతో హైదరాబాద్ లోని చెరువులకు చెర వీడు తుందంటూ వ్యాఖ్యానించారు. అసలు అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. హైడ్రాలాంటివి కచ్చితంగా ఉండాలని అన్నారు. జిల్లాలలో కూడా ఈ హైడ్రా ను తీసుకురావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు వేముల జగదీష్, బీసీ నాయకులు మహమ్మద్ యూసఫ్, రొంటాల క్రాంతి, వల్లెపు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.