Ambedkar Statue: ఘనంగా అంబేడ్కర్‌ విగ్రహా ఆవిష్కరణ

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

ఘనంగా అంబేడ్కర్‌ విగ్రహా ఆవిష్కరణ

ఆదిలాబాద్‌ జిల్లా రూరల్‌ మండలంలోని పిప్పల్‌ధరి గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం బుద్ధ పౌర్ణమి సందర్భంగా గ్రామస్తులు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచశీల్, త్రీశరణ్, అష్ఠగాథాలను ఆలపించి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ సేవలను కొనియాడారు. భారత దేశానికి రాజ్యంగాన్ని అందించిన మహానీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు పాయల్‌ శరత్, అస్తక్‌ సుభాష్, ధరంపాల్, దళిత మోర్చ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *