సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వెంకటగిరి పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తల తొలగించారు దుండగులు. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ తలను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
=======