Ambedkar Vidhyanidhi: అంబేద్కర్ విద్యానిధి కోసం దరఖాస్తుల ఆహ్వానం

సిరా న్యూస్, ఆదిలాబాద్:

అంబేద్కర్ విద్యానిధి కోసం దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి” పథకం ద్వార స్కాలర్షిప్ కోసం అర్హులైన ఎస్సీ విద్యార్థులు మార్చ్ 1 నుండి మార్చ్ 31 లోగా ఈపాస్ విధానంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి బి. సునీత కుమారి తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులని తెలిపారు. డిగ్రీలో 60% మార్కులు కలిగి జిఆర్ఈ లేదా జీమాట్ స్కోర్ తో పాటు ఇంగ్లీష్ పై మంచి పట్టు ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ స్కాలర్షిప్ కోసం ఎంపిక అయితే రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *