సిరా న్యూస్, సైదాపూర్:
ఎస్సై సిహెచ్ తిరుపతికి సన్మానం: ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు
ఇటీవల బదిలీపై సైదాపూర్ మండలానికి వచ్చిన ఎస్సై సిహెచ్ తిరుపతిని బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, మండల గౌరవ అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య, మండల అధ్యక్షుడు మారుపాక తిరుపతి, కోశాధికారి పొడిశెట్టి కొమురయ్య, ఉపాధ్యక్షుడు బొడిగె ఆనందం, కార్యవర్గ సభ్యులు వేముల సురేష్, గాదపాక ఎల్లయ్య, బోనగిరి అనిల్ పాల్గొన్నారు.