మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

 సిరా న్యూస్,కరీంనగర్;
ఉత్తర తెలంగాణ జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన‌ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈ నెల ఆరో తేదీతో తో పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ ముగిసింది. అయితే అనుకున్న స్థాయిలో ఓట్లు నమోదు కాకపోవడంతో ఆశావాహులు నిరాశగా‌ ఉన్నారు. అయితే ప్రధానపార్టీలు మాత్రం ఈ ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. ఓటర్లను ఆకర్షించడానికి ఎవరి వ్యూహాలు వారు రెడీ చేసుకుంటున్నారు . ముందుగానే ఆభ్యర్థులను ఖరారు చేసి.. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందే ప్రచారానికి తెర లేపడానికి పావులు కదుపుతున్నారు.ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న కరీంనగర్, అదిలాబాదు, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ‌స్థానం కైవసం చేసుకోవడానికి ప్రధాన పక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ముందుగానే అభ్యర్థులను‌ ఖరారు చేయడానికి కసరత్తు మొదలుపెట్టాయి. అధికార కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వేటలో నిమగ్నం అయ్యాయి. కాంగ్రెస్ ఇప్పటికే ముఖ్యనేతలతో సమావేశం ‌నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించింది. అదే విధంగా బిజేపి నలుగురు పేర్లతో అధిష్టానానికి జాబితాను‌ పంపింది. బిఅర్ఎస్ ‌మాత్రం ఎక్కడ కూడా హడావుడి చేయడం లేదు.పట్టభద్రుల లో ముఫ్ఫై నుండి ముప్ఫై ఐదు శాతం మాత్రమే ‌ఓటును నమోదు చేసుకోవడంతో.. అభ్యర్ధిత్తాలు ఆశిస్తున్న వారు నిరాశకు గురవుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ క్లారిటి ఇవ్వడం లేదు. ఒకరిద్దరూ నేతలు మాత్రం తాము బరిలో ఉంటామని‌ ప్రచారం చేసుకుంటున్నారు. కాని బీఅర్ఎస్ ‌నాయకత్వం నుండి వారికి ఎలాంటి సిగ్నెల్స్ లేవంట. కాంగ్రెస్, బిజేపి మాత్రం దూకుడు పెంచాయి. ఈ సీటుపై మరింత ఫోకస్ పెట్టి బలమైనా అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి.ఉత్తర తెలంగాణలో 2023 అసెంబ్లీ ‌ఎన్నికల వరకు బలంగా ఉన్న బీఅర్ఎస్ తర్వాత ఢీలా పడిపోవడతో ఎమ్మెల్సీఎన్నికలలో ఆ పార్టీ వ్యూహం ఏంటో అంతుపట్టకుండా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. బిజేపీ సైతం ఉత్తర తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లతో పాటు, ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దమైంది. లోక్‌సభ ఎన్నికల తరువాత జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్‌కి ప్రతిష్టాత్మకంగా మారింది.ఇంకా షెడ్యూల్ వెలువడని ఈ ఎమ్మెల్సీ ‌ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.ఇప్పటి నుండే‌ ఈ ప్రాంతం పైనా దృష్టి పెట్టింది.. కాంగ్రెస్ ఉత్తర తెలంగాణ కి చెందిన మంత్రులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఇజ్జత్‌ కా సవాల్‌లా మారిందంట. ఆయనతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ బీజేపీ ఎంపీలకు ఈ ఎన్నికల బాధ్యతలను అధిష్టానం అప్పగించిందంటున్నారు.నెలాఖరుకి కాంగ్రెస్, బీజేపీలు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు . ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ స్టాండ్ ఏంటో మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఎన్నికకి‌ సంబంధించి బీఆర్ఎస్ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. అయితే కాంగ్రెస్‌ని ఎదుర్కోవాలంటే తమకే‌ సాధ్యమని స్థానిక గులాబీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు . పోటీలో‌ఎలాంటి డౌట్ లేదు , కదన రంగంలో‌ నిలవడం గ్యారంటీ‌ అని ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఎవరి తలరాత ఎలా రాస్తారో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *